పర్మిషన్ లేని కల్లు దుకాణాలు మూసేయాలి : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: జిల్లాలో పర్మిషన్  లేకుండా ఇల్లీగల్ గా నడుస్తున్న కల్లు దుకాణాలపై నిఘా పెట్టి, వాటిని మూసేయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం ఎస్పీ తన ఛాంబర్ లో పోలీస్, ఎక్సైజ్ ఆఫీసర్లతో కో ఆర్డినేషన్  మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లైసెన్స్  ఉన్న కల్లు దుకాణాల్లో కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కల్తీ కల్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు కో ఆర్డినేషన్​తో కల్లు డిపోలను తనిఖీ చేసి, అనుమానం ఉన్న కల్లు షాపుల్లో శాంపిళ్లను సేకరించాలన్నారు. కల్లు కల్తీ చేసినట్టు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు భీమ్ కుమార్, రవిబాబు, టాటా బాబు, ఎస్బీ ఎస్ఐలు గణపతి రెడ్డి, హనుమా నాయక్  ఉన్నారు.