డ్రంక్  అండ్  డ్రైవ్ లో 45 మందికి జైలు

గద్వాల, వెలుగు: ఆగస్టు నెలలో డ్రంక్  అండ్  డ్రైవ్ లో పట్టుబడిన 45 మందికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్  అండ్  డ్రైవ్  టెస్ట్ లు చేసి కేసులు నమోదు చేశామని చెప్పారు.

మద్యం తాగి వెహికల్స్  నడపొద్దని, ట్రాఫిక్  రూల్స్  తప్పకుండా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.