సరిహద్దులో  వాహనాల తనిఖీ : ఎస్పీ శ్రీనివాసరావు

అలంపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని  ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సరిహద్దు ప్రాంతంలో  వాహనాల తనిఖీని నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర మెగా వాహన తనిఖీని నిర్వహించారు.  

స్టేట్​ బార్డర్స్​ దాటుతున్న వెహికల్స్​ను ఆపి, డాక్యుమెంట్లు చెక్​ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్​ చేశామన్నారు.    డ్రైవర్లు ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని,  పబ్లిక్​ ట్రాన్స్​పొటేషన్​ వాహనాల్లో ప్యాసింజర్లకు నమ్మకం కలిగే డ్రైవర్లు డ్రైవింగ్​ చేయాలని  చెప్పారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ  సత్యనారాయణ, సీఏలు   రవిబాబు,  నాగేశ్వర్​ రెడ్డి పాల్గొన్నారు.