గద్వాల, వెలుగు: గద్వాల టౌన్ లో ఎస్పీ శ్రీనివాస రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి మూడు గంటల వరకు గద్వాల టౌన్‌లోని రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, కృష్ణవేణి చౌక్, బిరెల్లి రోడ్ తో పాటు రైల్వేస్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నైట్ డ్యూటీ సిబ్బంది ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు. బ్లూ కోట్స్ సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు.
అనంతరం గద్వాల టౌన్ పీఎస్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాత్రివేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.