పటాన్చెరు, వెలుగు: వార్షిక తనిఖీల్లో భాగంగాఎస్పీ రూపేశ్ మంగళవారం పటాన్చెరు డీఎస్పీ ఆఫీసును సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను చెక్ చేశారు. డౌరీ డెత్, ఎస్సీ, ఎస్టీ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కొత్త చట్టాల ప్రకారం తగు జాగ్రత్తలను పాటించాలని సిబ్బందికి సూచించారు.
పటాన్చెరు హైదరాబాద్ పరివాహక ప్రాంతం కావడంతో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, అధిక పరిశ్రమలు ఉండడంతో ఉపాధి కోసం వచ్చే మైగ్రేట్ లేబర్స్తో పాటు తరుచూ ఉద్యోగుల తాకిడి వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటుందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ట్రాఫిక్ ఎన్స్ఫోర్స్మెంట్చేయాలన్నారు. తరుచూ వెహికల్ చెకింగ్, నాకాబంది వంటి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలన్నారు.
జిల్లాలో నిషేదిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలు, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం మోపాలన్నారు. జిల్లా సరిహద్దులలో, హైవేలపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలన్నారు. ఆన్లైన్మోసాలు, భూ సంబంధిత చీటింగ్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ సంజీవ రావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.