యూనిఫామ్ సర్వీస్ లో ఫిజికల్​ ఫిట్​నెస్​ కీలకం : ఎస్పీ రూపేశ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: యూనిఫామ్ సర్వీస్ లో ఫిజికల్ ఫిట్​నెస్​ చాలా ముఖ్యమని, తొమ్మిది నెలల ట్రైనింగ్ జీవితకాలం ఫిట్​గా ఉండడానికి తోడ్పడుతుందని ఎస్పీ రూపేశ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుల్స్ తో మాట్లాడుతూ.. ట్రైనింగ్ పూర్తి కావస్తున్న సందర్భంగా ఫైనల్ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.

ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాల్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని సూచించారు. అంకిత భావంతో పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చెడు అలవాట్లకు బానిసలు కావొద్దని, ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్​విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అనవసర లోన్స్ జోలికి వెళ్లి అప్పుల పాలు కావద్దని ఎస్పీ సూచించారు. ఆయన వెంట ట్రైనింగ్​సెంటర్​అధికారులు ఉన్నారు. 

 ప్రతి పిటిషన్ ను ఆన్​లైన్​లో నమోదు చేయాలి 

 జిన్నారం: ప్రతి పిటిషన్ ను ఆన్​లైన్​లో నమోదు చేయాలని, పీఎస్​కు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఎస్పీ రూపేశ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిన్నారం పీఎస్​ను సందర్శించారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితి లిమిట్ లో ఉండాలని, నాణ్యమైన దర్యాప్తు చేయాలని ఎస్ హెచ్ వో కు సూచించారు.  సీసీ కెమెరాల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సుధీర్ కుమార్, ఎస్ఐ నాగలక్ష్మి ఉన్నారు.