ట్రాఫిక్​ సిగ్నల్స్​ ప్రారంభించిన ఎస్పీ రూపేశ్

పటాన్​చెరు, వెలుగు: సొసైటీ ఫర్​​సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్​((ఎస్​ఎస్​ఎస్​సీ) ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రతా కార్యక్రమాల్లో భాగంగా పటాన్​చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్​ సిగ్నల్స్​ను గురువారం ఎస్పీ రూపేశ్ ప్రారంభించారు.​  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఆ సమస్యను అధిగమించేందుకు కొత్తగా ట్రాఫిక్​ సిగ్నల్స్​ను​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్ విధిస్తామని తెలిపారు. అన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఎస్ఎస్ఎస్​సీ లో సొసైటీలో మెంబర్ గా చేరాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ఎస్ఎస్​సీ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, పలు కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సబ్-డివిజన్ ఇన్​ స్పెక్టర్లు లాలు నాయక్, నాగరాజు, స్వామి గౌడ్ పాల్గొన్నారు.