బుక్స్ చదవడం అలవర్చుకోవాలి : ఎస్పీ రితిరాజ్

గద్వాల, వెలుగు: లక్ష సాధనలో భాగంగా స్టూడెంట్స్  మంచి వ్యక్తులకు సంబంధించిన బుక్స్  చదవడం అలవర్చుకోవాలని ఎస్పీ రితిరాజ్ సూచించారు. శనివారం పట్టణంలోని స్టూడెంట్స్ తో మాట్లాడుతూ.. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు.

 మంచి ఫ్రెండ్స్ ని ఎంపిక చేసుకుంటే, జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్ని ఫెయిల్యూర్స్  వచ్చినా కష్టపడితే తప్పకుండా సక్సెస్  వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలన్నారు.