శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్​ సెర్చ్​ : రావుల గిరిధర్

  • ఎస్పీ రావుల గిరిధర్ 

వనపర్తి, వెలుగు : నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్​ సెర్చ్​ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్​ తెలిపారు. శనివారం డీఎస్పీ వెంకటేశ్వర రావు , సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని జంగాలగుట్ట, బుడగ జంగాల కాలనీల్లో పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. సుమారు 250 ఇండ్లలో సోదాలు చేశారు. పత్రాలు సరిగా లేని, నెంబర్ ప్లేట్ లేని 2 కార్లు, 3 ఆటోలు, 25 టూ వీలర్లు మొత్తం30 వెహికల్స్​ను సీజ్ చేసి వనపర్తి రూరల్ పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు.

నిషేధిత గుట్కా లు, గుడుంబా తయారీ, గంజాయి విక్రయించడం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టూ వీలర్లు నడిపేప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని  అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని, మైనర్లకు వెహికిల్స్​ ఇవ్వరాదని సూచించారు. 

ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాందాస్ తేజావత్, సీఐఈలు రాంబాబు, ఏఆర్​ సీఐ అప్పలనాయుడు, రూరల్ ఎస్సై, జలేందర్ రెడ్డి, 80 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.