ప్రజలకు పారదర్శక సేవలందించాలి : ఎస్పీ రావుల గిరిధర్​

  • ఎస్పీ రావుల గిరిధర్​

ఖిల్లాగణపురం, వెలుగు : విధుల పట్ల అంకితభావంతో  ఉండాలని,  ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్​ అన్నారు. గురువారం రాత్రి ఆయన ఖిల్లాగణపురం పోలీస్​ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  స్టేషన్లో  రికార్డ్స్ ను, పరిసరాలను పోలీస్టేషన్  రిసెప్షన్, లాకప్ , మెన్ బ్యారేక్, టెక్నికల్ రూంను  పరిశీలించారు.

పోలీస్​స్టేషన్ పరిధిలో  ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో  నేరాలు, ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితుల వివరాలను, పెండింగ్ లో  ఉన్న కేసుల వివాలను  ఎస్సై సురేశ్​ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలన్నారు. రోడ్లమీద ధాన్యం ఆరబోయరాదని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.