కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి

వనపర్తి, వెలుగు : ప్రతి  పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సూచించారు. బుధవారం జిల్లా పోలీసుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జులై ఒకటి నుంచి అమలులోకి రానున్న కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ట్రైనింగ్​ ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని

Also read : దేశంలో తెలంగాణ జైళ్ల శాఖ ఆదర్శం : డీజీ సౌమ్య మిశ్రా

అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకెళ్లాలన్నారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు. అరెస్ట్, వాంగ్మూలం నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సిన తీరు, కొత్త చట్టాల్లో మార్పుల గురించి వివరించారు. డీసీఆర్బీ డీఎస్పీ కృష్ణ కిశోర్, ఏఎస్ఐ బాషా పాల్గొన్నారు.