ఎగ్జామ్  సెంటర్​ను తనిఖీ చేసిన ఎస్పీ

వనపర్తి టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ఇంటర్  ఎగ్జామ్​ సెంటర్లను గురువారం ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి తనిఖీ చేశారు. సీవీ రామన్, త్రివేణి జూనియర్  కాలేజీల్లో ఎగ్జామ్స్  జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్  అమలులో ఉందని, ఎక్కువ మంది గుమికూడకుండా

చూడాలని పోలీస్  సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. అధికారులను సైతం గేట్​ వద్ద తనిఖీ చేశాకే అనుమతించాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అన్ని సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.