ప్రజలకుఎప్పుడూ అందుబాటులో ఉండాలి : ఎస్పీ జానకి ​

నవాబుపేట, వెలుగు: ప్రజలకు   పోలీసులు  ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఎస్పీ జానకీ సూచించారు. గురువారం ఆమె మండలంలోని పలు పోలీస్​ స్టేషన్లను విజిట్​ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్​ రికార్డులను పరిశీలించారు.  అనంతరం ఆమె మాట్లాడారు.  స్టేషన్లలో సిబ్బంది టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు.   సమాజంలో క్రైం రేటు తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు.

 ఆమె వెంట ఎస్సై విక్రమ్, ఎఎస్ఐ అనంద్, సీనియర్​ సిబ్బంది సురేశ్​కుమార్, రాజుగౌడ్, భాస్కర్, నరేశ్, మహేశ్, ఆంజనేయులు, జావేద్, గులాం తదితరులు  ఉన్నారు.