పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ జానకి

పాలమూరు, వెలుగు : వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్​ ఆఫీస్​ కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం సందర్భంగా ప్రతి విలేజ్​లో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 

గ్రామాలు, పట్టణాల్లో నిఘా మరింత పెంచాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. సైబర్  నేరాలపై తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడిషనల్​ ఎస్పీ రాములు, డీఎస్పీలు వెంకటేశ్వర్లు,  రమణారెడ్డి, సైబర్  క్రైం డీఎస్పీ సుదర్శన్  పాల్గొన్నారు.

రేవల్లి : మండలంలో గణేశ్  నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ రాము సూచించారు. పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా పోలీసులను అందుబాటులో ఉంచుతామని, ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు.