బిజినేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ : గైక్వాండ్ వైభవ్ రఘునాథ్

 కందనూలు, వెలుగు:    చట్టాలపై  ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నాగర్ కర్నూల్  ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్ అన్నారు.  బిజినేపల్లి పోలీస్ స్టేషన్   బుధవారం ఆయన  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ..    స్టేషన్​కు వచ్చే వారితో మర్యాదగా  నడుచుకోవాలని చెప్పారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చెప్పారు. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్య, ఎస్సై నాగ శేఖర రెడ్డి సిబ్బంది ఉన్నారు.