కొత్త చట్టాలపై అవగాహన తప్పనిసరి : గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కొత్త చట్టాలపై పోలీసులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. నాగర్ కర్నూల్ ఎస్పీ మీటింగ్ హాల్​లో మారిన కొత్త చట్టాలపై పోలీసులకు గురువారం అవగాహన కల్పించారు. జిల్లా నుంచి అడిషనల్ ఎస్పీ రామేశ్వర్,  సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమేశ్, ఎస్ఐ గురు స్వామి హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకున్నారన్నారు. జిల్లాలోని సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారని ఎస్పీ వివరించారు. జిల్లాలో 600 మందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.