సదరన్ ట్రావెల్స్ బంపర్​ ఆఫర్...ప్రతి బుకింగ్​పై లక్కీ డ్రా కూపన్లు

బషీర్ బాగ్, వెలుగు: ‘ట్రావెల్స్ హాలిడే మార్ట్’ పేరిట డిసెంబర్ 31 నుంచి జనవరి 31 వరకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి తెలిపారు. సమ్మర్ హాలిడేస్ కు ముందస్తుగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టూర్​ప్యాకేజీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బుకింగ్ పై డిస్కౌంట్ తో పాటు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గెలుపొందిన వారికి కియా కార్, బైక్స్, సింగపూర్ టూర్, 10 గ్రాముల బంగారం అందిస్తామన్నారు. ఇంటర్నేషనల్ టూర్ లో వీసాతోపాటు, అకామిడేషన్, ట్యాక్సీ సర్వీసెస్ తామే అందజేస్తామన్నారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో త్వరలో మొదలుకానున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు అక్కడ వసతి ఏర్పాటుతోపాటు తక్కువ ధరలకు ట్రావెల్ ప్యాకేజీ అందిస్తున్నట్లు వివరించారు. ఏపీ, తెలంగాణలోని సదరన్ ట్రావెల్స్ ఆఫీసుల్లో టూర్స్ బుక్ చేసుకోవచ్చన్నారు.