సంక్రాంతికి 52 స్పెషల్​ ట్రైన్స్

  • 6 నుంచి 15 వరకు అందుబాటులో రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) వివిధ మార్గాల్లో 52  స్పెషల్​రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు ఈ నెల 6 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. 

చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, వికారాబాద్కా-కినాడ టౌన్ -వికారాబాద్, కాచిగూడ-తిరుపతి-కాచిగూడ, చర్లపల్లి-నర్సాపూర్ - చర్లపల్లి, సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ - సికింద్రాబాద్, చర్లపల్లి - నర్సాపూర్ - చర్లపల్లి, చర్లపల్లి- కాకినాడ టౌన్ -చర్లపల్లి, నాందేడ్- కాకినాడ టౌన్ -​నాందేడ్, చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ -​చర్లపల్లి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు  వెల్లడించారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే  ప్రయాణీకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.