ప్రయాణికులకు శుభవార్త: విజయవాడ టు హుబ్లీ ఉగాది స్పెషల్ రైలు

విజయవాడ హుబ్లీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సెలవు మరియు ఉగాది పండుగ దృష్ట్యా నెలకొనే రద్దీ కారణంగా ఈ సర్వీసులు నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు. విజయవాడ టు హుబ్లీ 10వ తేదీ ఒక రైలు, హుబ్లీ టు విజయవాడ 11వ తేదీ ఒక రైలు నడపనుంది. ఈ రైలు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, గుంతకల్, బళ్లారి, హొస్పెట్ జంక్షన్ మీదుగా వెళ్తుందని తెలిపారు అధికారులు. ఉగాది సందర్బంగా కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులంతా ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.