BAN vs SA 2024: ఒక్క రోజులోనే 16 వికెట్లు.. బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ తేడాతో గెలిచింది. పసికూన బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చటోగ్రామ్ వేదికగా జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అతి పెద్ద పరాజయాన్ని మూటకట్టుకుంది. 

తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్ ఫాలో ఆన్ ఆడుతూ 143 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు ముత్తుస్వామి, కేశవ్ మహారాజ్ విజృంభించడంతో బంగ్లా దగ్గర సమాధానమే లేకుండా పోయింది. కేశవ్ మహారాజ్5 వికెట్లు పడగొడితే.. ముత్తుస్వామి 4 వికెట్లు పడగొట్టాడు. 4 వికెట్లకు 38 పరుగులు వద్ద మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రబడా 5 వికెట్లు తీయడంతో 159 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

ALSO READ | IND vs SA 2024: భారత్‌తో టీ20 సిరీస్.. క్లాసన్, మిల్లర్‌లతో పటిష్టంగా సౌతాఫ్రికా జట్టు

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టోనీ డి జోర్జి (177) భారీ సెంచరీకి తోడు స్టబ్స్(106), మల్డర్(105) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తైజుల్ ఇస్లాం 5 వికెట్లట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోనీ డి జోర్జికి లభించింది. కగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.