విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో..ఫైనల్లో సౌతాఫ్రికా

  • సెమీస్‌‌‌‌లో ఆస్ట్రేలియాకు చెక్‌‌‌‌
  • నేడు విండీస్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌ పోరు

దుబాయ్‌‌‌‌ : విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఆస్ట్రేలియాకు ఈసారి సెమీస్‌‌‌‌లోనే చెక్‌‌‌‌ పడింది. ఏడోసారి టైటిల్‌‌‌‌ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలకు సౌతాఫ్రికా షాకిచ్చింది. ఛేజింగ్‌‌లో అనెకె బాష్‌‌‌‌ (74 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ లారా వోల్‌‌‌‌వర్త్‌‌‌‌ (42) చెలరేగడంతో.. గురువారం జరిగిన తొలి సెమీస్‌‌‌‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌‌‌‌పై గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన ఆసీస్‌‌‌‌ 20 ఓవర్లలో 134/5 స్కోరు చేసింది. బెత్‌‌‌‌ మూనీ (44), ఎలైస్‌‌‌‌ పెర్రీ (31) రాణించారు.

హారిస్‌‌‌‌ (3), వారెహామ్‌‌‌‌ (5) ఫెయిలవగా,  తహ్లియా మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ (27), లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (16 నాటౌట్‌‌‌‌)  ఫర్వాలేదనిపించారు. అయబోంగా కాకా రెండు, కాప్‌‌‌‌, మలాబా చెరో వికెట్‌‌‌‌ తీశారు. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 135/2 స్కోరు చేసి నెగ్గింది. తొలి వికెట్‌‌‌‌కు 25 రన్స్‌‌‌‌ జత చేసి తన్జిమ్‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌ (15) ఔటైనా.. లారా, బాష్​ రెండో వికెట్‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌ జత చేసి గెలుపు దిశగా తీసుకెళ్లారు.

చివర్లో లారా వెనుదిరిగినా చోలె ట్రయాన్‌‌‌‌ (1 నాటౌట్‌‌‌‌)తో కలిసి బాష్‌‌‌‌ మరో 16 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. సదర్లాండ్‌‌‌‌ 2 వికెట్లు తీసింది. అనెకె బాష్‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే రెండో సెమీస్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌తో తలపడుతుంది.