డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు సౌతాఫ్రికా

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌: వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌‌‌‌‌‌‌కు సౌతాఫ్రికా క్వాలిఫై అయింది. సొంతగడ్డపై  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. పాక్ ఇచ్చిన 148 రన్స్‌‌‌‌‌‌‌‌  టార్గెట్‌‌‌‌‌‌‌‌ ను 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించి ఉత్కంఠ విజయం సాధించింది. 

మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (37 ), బవూమ (40 )తో పాటు చివర్లో కగిసో రబాడ (31 నాటౌట్‌‌‌‌‌‌‌‌), మార్కో యాన్సెన్ (16) తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు అజేయంగా 51 రన్స్ జోడించి సౌతాఫ్రికాను గెలిపించారు. పాక్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మొహమ్మద్ అబ్బాస్ (6/54) ఆరు వికెట్లు పడగొట్టాడు.  మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గా నిలిచాడు. రెండో టెస్టు శుక్రవారం నుంచి కేప్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.