ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌కు టీమ్‌‌‌‌ ఎంపిక

ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌కు టీమ్‌‌‌‌ ఎంపిక

జొహన్నెస్‌‌‌‌బర్గ్‌‌‌‌: యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ మార్కో జాన్సెన్‌‌‌‌ సౌతాఫ్రికా వన్డే టీమ్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇండియాతో ఈనెల 19 నుంచి జరిగే మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ కోసం ఆదివారం ప్రకటించిన టీమ్‌‌‌‌లో అతనికి ప్లేస్‌‌‌‌ దక్కింది. టెంబా బవూమ కెప్టెన్సీలోని ఈ టీమ్‌‌‌‌కు మొత్తం 17 మందిని సెలెక్ట్‌‌‌‌ చేశారు. స్పిన్నర్‌‌‌‌ కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌కు వైస్‌‌‌‌ కెప్టెన్సీ ఇచ్చారు.  గాయం కారణంగా టెస్టు సిరీస్‌‌‌‌కు దూరమైన సీనియర్​ పేసర్‌‌‌‌ అన్రిచ్‌‌‌‌ నోర్జ్‌‌‌‌ వన్డే సిరీస్‌‌‌‌లోనూ ఆడటం లేదు. 
టీమ్‌‌‌‌: బవూమ (కెప్టెన్‌‌‌‌), కేశవ్‌‌‌‌ (వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌), డికాక్‌‌‌‌, హమ్జా, జాన్సెన్‌‌‌‌, జానేమన్‌‌‌‌ మలన్‌‌‌‌. మగాల, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, ఎంగిడి, వేన్‌‌‌‌ పార్నెల్‌‌‌‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌‌‌‌, రబాడ, షంసి, డుసెన్‌‌‌‌, కైల్‌‌‌‌ వెరేన్‌‌‌‌.
 

మరిన్ని వార్తలు