IND vs SA 2nd T20: భారత్ బ్యాటింగ్.. ఒక మార్పుతో సౌతాఫ్రికా జట్టు

భారత్, సౌతాఫ్రికా జట్లు రెండో టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. గెబార్హ వేదికగా సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకుంది. తొలి టీ20 విజయంతో జోరుమీదున్న యంగ్‌‌‌‌ టీమిండియా..ఆదివారం (నవంబర్ 10) జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో స్పష్టమైన ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది.తొలి మ్యాచ్‌‌‌‌లోనూ ఓడటం సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా దెబ్బతీసింది. దీంతో రెండో మ్యాచ్‌‌‌‌ లో గెలిచి లెక్క సరిచేయాలని చూస్తోంది.

ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా క్రూగర్ స్థానంలో బ్యాటర్ రీజా హెన్డ్రిక్స్ ను తుది జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత్ (ప్లేయింగ్ XI):

సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలనే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్