SA vs PAK: కెప్టెన్‌గా బవుమా.. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ప్రస్తుతం పాకిస్థాన్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్ సిరీస్ లో భాగంగా తొలి టీ20 ముగిసింది. ఆ తర్వాత పాకిస్థాన్ తో మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ జట్టును ప్రకటించగా.. సౌతాఫ్రికా జట్టును నేడు (డిసెంబర్ 12) ప్రకటించారు. 15 మందితో కూడిన సౌతాఫ్రికా జట్టుకు టెంబా బవుమా కెప్టెన్సీ చేయనున్నాడు. డిసెంబర్ 17న తొలి వన్డే ప్రారంభం కానుంది. పార్ల్ తొలి వన్డేకు ఆతిధ్యమివ్వనుంది. కేప్ టౌన్, జోహన్నెస్‌బర్గ్‌లు వరుసగా చివరి రెండు వన్డేలకు ఆతిధ్యమిస్తాయి. 

ALSO READ | World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేష్

కగిసో రబాడ, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ సహా పలువురు కీలక ఆటగాళ్లను జట్టులో చేరారు. ఈ సంవత్సరం ప్రారంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్న షమ్సీకి ఇది ముఖ్యమైన సిరీస్. అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్‌గిడి, గెరాల్డ్ కోట్జీ, వియాన్ ముల్డర్, నాండ్రే బర్గర్‌లు లాంటి ఫాస్ట్ బౌలర్లు గాయాలతో ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు. క్వేనా మఫాకా తనను తాను నిరూపించుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా మారింది. 

పాకిస్థాన్ తో వన్డే సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు:

టెంబా బావుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, మార్కో జాన్‌సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ స్కెల్టన్, వాన్ డెర్ డస్సెన్