BAN vs SA: తొలి రోజే 16 వికెట్లు.. ఆసక్తికరంగా సౌతాఫ్రికా,బంగ్లాదేశ్ టెస్ట్

ఢాకా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న ఆసక్తికరంగా సాగుతుంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా   బౌలర్లు ఆధిపత్యం చూపించారు. దీంతో ఒక్క రోజే ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. ఇలాగే కొనసాగితే ఈ మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసిన ఆశ్చర్యం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ సఫారీ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 

ప్రస్తుతం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో వికెట్ కీపర్ వేరైన్ (18), ఆల్ రౌండర్ మల్డర్ (17) ఉన్నారు. 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా వీరిద్దరూ ఏడో వికెట్ కు అజేయంగా 32 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. జార్జి (30), స్టబ్స్ (23), రికెల్ టన్ (27) లకు మంచి ఆరంభాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఒక్కడే 5 వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. 

ALSO READ | Ranji Trophy 2024-25: పుజారా డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ బ్రేక్

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. 30 పరుగులు చేసిన హసన్ జాయ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రబడా,మల్డర్,కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. పీడ్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడా టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. అతి తక్కువ బంతుల్లో ఈ ఘనతను అందుకుని ప్రపంచ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 11817 బంతుల్లో రబడా 300 వికెట్లు పడగొట్టాడు.