సౌతాఫ్రికా క్లీన్‌‌స్వీప్‌‌..రెండో టెస్టులో 109 రన్స్‌‌ తేడాతో శ్రీలంకపై గెలుపు

  • డబ్ల్యూటీసీలో టాప్‌‌ ప్లేస్‌‌కు

గెబెహా (సౌతాఫ్రికా) : శ్రీలంకతో  రెండో టెస్టులో సౌతాఫ్రికా 109 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేయడంతో పాటు  వరల్డ్ టెస్టు చాంపియన్‌‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌‌లోకి దూసుకొచ్చింది. ఆతిథ్య సఫారీ టీమ్ ఇచ్చిన 348 టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో చివరి రోజు, సోమవారం  205/5 స్కోరుతో ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌‌లో 69.1 ఓవర్లలో 238 రన్స్‌‌కే ఆలౌటైంది.

కెప్టెన్ ధనంజయ డిసిల్వా (50), కుశాల్  మెండిస్ (46) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. సఫారీ బౌలర్లలో కేశవ్‌‌ మహారాజ్‌ ఐదు వికెట్లతో లంకను దెబ్బకొట్టాడు. డేన్ పీటర్సన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌, టెంబా బవూమకు ప్లేయర్ ఆఫ్​ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Also Read:-లెక్క మారింది..రసవత్తరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు

ఈ విజయంతో సౌతాఫ్రికా 63.33 పీటీసీతో ఆసీస్‌‌ను వెనక్కునెట్టి డబ్ల్యూటీసీలో ఫైనల్ చేరింది. ఈ నెల 26 నుంచి సొంతగడ్డపై పాకిస్తాన్‌‌తో  రెండు టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మరింత చేరువైంది.