SA vs SL, 2nd Test: టెస్ట్ ఛాంపియన్ షిప్.. అగ్ర స్థానానికి దూసుకెళ్లిన సౌతాఫ్రికా

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా దూసుకెళ్తుంది. ఏకంగా అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. సోమవారం (డిసెంబర్ 9) శ్రీలంపై 109 పరుగుల భారీ విజయం సాధించడంతో ఆస్ట్రేలియాను ధాటి టాప్ లో కి వెళ్ళింది. ఐదో రోజు 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా  ప్రస్తుతం సౌతాఫ్రికా 63.33  పీటీసీతో టాప్ ప్లేస్‌‌కు చేరుకోగా..ఆస్ట్రేలియా 60.71 పీటీసీతో  రెండో స్థానానికి పరిమితమైంది. ఇండియా (57.29) ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్, భారత్ జట్లు 1-1 నిలవడం సౌతాఫ్రికాపై కలిసి వచ్చింది. 

ఫైనల్ రేసు నుంచి న్యూజిలాండ్ ఔట్

వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలైన న్యూజిలాండ్‌.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి టెస్టులో న్యూజిలాండ్ గెలిచినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్థుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కేవలం నాలుగు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక. ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది.

ALSO READ | IND vs AUS: ట్రావిస్ హెడ్‌ను ఆపాలంటే అదొక్కటే మార్గం: భారత్‌పై ఇంగ్లాండ్ క్రికెటర్ సెటైర్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్:

దక్షిణాఫ్రికా: 63.33 (విజయాల శాతం)

ఆస్ట్రేలియా: 60.71 (విజయాల శాతం)

భారత్: 57.29 (విజయాల శాతం)

శ్రీలంక: 45.45 (విజయాల శాతం)

ఇంగ్లండ్: 45.24  (విజయాల శాతం)

న్యూజిలాండ్: 44.23  (విజయాల శాతం)