జడేజా బ్యాటింగ్ కీలకం: దాదా

జడేజా బ్యాటింగ్ కీలకం: దాదా

న్యూఢిల్లీ: ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌‌‌‌లో ఇంప్రూవ్‌‌‌‌ కావడం ఫ్యూచర్‌‌‌‌లో టీమిండియాకు చాలా కీలకమని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ అన్నాడు. దీనివల్ల లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ బలోపేతమవుతుందన్నాడు. కెరీర్‌‌‌‌ ఆరంభంతో పోలిస్తే ప్రస్తుతం జడ్డూ చాలా మెరుగయ్యాడని దాదా ప్రశంసించాడు. డెత్‌‌‌‌ ఓవర్లలో భారీ షాట్లకు పోకుండా చాలా ప్లాన్డ్‌‌‌‌గా బ్యాటింగ్‌‌‌‌ చేశాడని కితాబిచ్చాడు. ‘ఇండియాకు మరో విజయం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ జడేజా బ్యాటింగ్‌‌‌‌ సూపర్బ్‌‌‌‌. బ్యాటింగ్‌‌‌‌లో జడ్డూ చాలా మెరుగయ్యాడు’ అని మూడో వన్డే తర్వాత గంగూలీ ట్వీట్‌‌‌‌ చేశాడు. వన్డేల్లో 2188 రన్స్‌‌‌‌ చేసిన జడ్డూ 11 హాఫ్‌‌‌‌ సెంచరీలు చేశాడు. లాంగ్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లోనూ 1844 రన్స్‌‌‌‌తో పాటు ఓ సెంచరీ 14 హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించాడు.

సీజన్ ను టాప్ ర్యాంకులతో ముగించన కోహ్లీ

ఇండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, లిమిటెడ్‌‌ ఓవర్స్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ  ఈ సీజన్‌‌ను టాప్‌‌ ర్యాంకులతో ముగించారు. వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌‌లో సత్తా చాటిన ఈ ఇద్దరూ ఐసీసీ వన్డే బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంకింగ్స్‌‌లో తొలి రెండు స్థానాలు  కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన చివరి వన్డేలో కీలక ఇన్నింగ్స్‌‌తో ఇండియాను గెలిపించిన కోహ్లీ టాప్‌‌ ర్యాంక్‌‌ను నిలబెట్టుకున్నాడు. ఇక వైజాగ్‌‌ వన్డేలో భారీ సెంచరీ, కటక్‌‌లో హాఫ్‌‌ సెంచరీతో రాణించిన రోహిత్‌‌ సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు. ఇండియా ఇతర బ్యాట్స్‌‌మెన్‌‌లో  లోకేశ్‌‌ రాహుల్‌‌, శ్రేయస్‌‌ ర్యాంకులు మెరుగయ్యాయి. రాహుల్‌‌ 17 ప్లేస్‌‌లు మెరుగై 71వ స్థానంలో నిలవగా..  అయ్యర్‌‌ 104 నుంచి 81 ర్యాంక్‌‌కు చేరుకున్నాడు. కాగా, విండీస్‌‌ ఓపెనర్‌‌ షై హోప్‌‌ టాప్‌‌–10లోకి వచ్చాడు.  ఇండియాపై చెలరేగి ఆడిన అతను ఐదు స్థానాలు మెరుగై తొమ్మిదో ప్లేస్‌‌ సాధించాడు. అలాగే, షిమ్రన్‌‌ హెట్‌‌మయర్‌‌ 25 నుంచి 19కి, నికోలస్‌‌ పూరన్​ 63 నుంచి 30వ ప్లేస్‌‌కు చేరుకున్నారు. ఫాస్ట్ బౌలర్లలో షెల్డన్‌‌ కాట్రెల్‌‌ 36 నుంచి 30వ ప్లేస్‌‌కు వచ్చాడు.