IND vs NZ, Women's T20 World Cup 2024: కివీస్ కెప్టెన్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు విఫలమయ్యారు. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ లో అటాకింగ్ చేయడంతో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫియా డివైన్ (57) మెరుపు హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. రేణుక ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టింది. భారత బౌలర్లలో అరుంధతి, ఆశ శోభనకు చెరో వికెట్ దక్కింది.   

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే కివీస్ ఆటగాళ్లు భారత్ పై ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో స్కోర్ వేగం దూసుకెళ్లింది. జార్జియా ప్లిమ్మర్, సుజీ బేట్స్ బ్యాట్ ఝళిపించడంతో పవర్ ప్లే లోనే 55 పరుగులు రాబట్టుకుంది. ఈ  దశలో భారత్ వరుసగా రెండు వికెట్లు తీసి కివీస్ జోరును తగ్గించారు. ఓపెనర్లు ఇద్దరూ వేగంగా ఆడే క్రమంలో వికెట్ ప్లిమ్మర్(34), సుజీ బేట్స్(27) వికెట్లను కోల్పోయింది. 

Also Read : భారత్, బంగ్లాదేశ్ మూడో టీ20

ఈ దశలో కెప్టెన్ సోఫియా డివైన్ జట్టును ఆదుకుంది. ముందుండి నడిపిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మిగిలిన బ్యాటర్లు తడబడినా.. సోఫియా అదరగొట్టింది. దీంతో 160 పరుగుల గౌరవ ప్రథమమైన స్కోర్ చేయగలిగింది. చివర్లో బ్రూక్ హళ్లి డే బౌండరీలు కొట్టి కీలక ఇన్నింగ్స్ ఆడింది.