దసరాకు ప్రత్యేక రైళ్లు..పునప్రారంభం కానున్న తేజస్ సర్వీసులు

దసరాకు ప్రత్యేక రైళ్లు..పునప్రారంభం కానున్న తేజస్ సర్వీసులు

దసరా పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 39 ప్రత్యేక ట్రైన్లను నడిపేందుకు రైల్వే బోర్డ్ అనుమతిచ్చింది.

బోర్డు ఆమోదించిన 39 రైళ్లలో చాలావరకు ఏసీ ఎక్స్ ప్రెస్ లు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో దురంతో, రాజధాని, శాతాబ్ధి ట్రైన్ తరహాలో ఉండగా.. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం త్వరలో వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

దీంతో పాటు పండుగ సీజన్ కారణంగా ప్రయాణీకుల సౌకర్యార్ధం  తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునప్రారంభిస్తున్నట్లు ఐఆర్ సీటీసీ తెలిపింది.  కరోనావైరస్ మహమ్మారి కారణంగా మార్చి 19 నుండి నిలిపేసిన లక్నో-న్యూ ఢిల్లీ,  అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్టోబర్ 17 నుంచి సర్వీసులు ప్రారంభమవుతున్నాయి.