పీసీ గేమర్ల కోసం సరికొత్త గేమింగ్ హెడ్‌సెట్‌ను సోని ఇండియా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇన్‌జోన్ పేరుతో వచ్చిన ఈ హెడ్‌సెట్ ధర రూ. 9,990 (ఇన్‌జోన్ హెచ్3) నుంచి స్టార్టవుతోంది. ఇన్‌జోన్ హెచ్7 ధర రూ. 21,990 కాగా, ఇన్‌జోన్ హెచ్9 ధర రూ. 27,990.
ఇన్‌జోన్ హెచ్9 ఫుల్ బ్యాటరీపై 32 గంటలు వస్తుందని, ఇన్‌జోన్ హెచ్7 40 గంటల పాటు వస్తుందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. సోని రిటైల్ స్టోర్లు, షాప్ఎట్‌డాట్‌కామ్ పోర్టల్, మేజర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లు, ఈ–కామర్స్ సైట్ల నుంచి ఈ హెడ్‌సెట్‌ను కొనుక్కోవచ్చు.
