హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ ఇండియా ‘బ్రావియా ఎక్స్ఆర్ 85ఎక్స్95కే’ పేరుతో 85 ఇంచుల 4కే మినీ ఎల్ఈడీ టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ.7 లక్షలు. ఇందులోని కాగ్నిటివ్ ప్రాసెసర్ యూజర్ మాటలను సులువుగా అర్థం చేసుకుంటుంది. బ్రైట్‍నెస్ కోసం లేటెస్ట్ జనరేషన్ మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైట్ ఉంటుంది.
గేమింగ్ అనుభవం కోసం 120 ఎఫ్పీఎస్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్, ఆటో హెచ్డీఆర్ టోన్, ఆటో గేమ్ మోడ్ ఉంటాయి. బ్రావియా సీఓఆర్ ఈ యాప్ ద్వారా ఐమాక్స్ సినిమాల కలెక్షన్ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ టీవీలో ఎక్స్ -యాంటీ రిఫ్లెక్షన్, ఎక్స్ వైడ్ ఆంగిల్, జెశ్చర్ కంట్రోల్, ప్రాక్సిమిటీ అలర్ట్, పిక్చర్, సౌండ్ యాంబియంట్ ఆప్టిమైజేషన్, వీడియో కాల్, 3డీ సరౌండ్ సౌండ్ వంటి చాలా ఆకర్షణలు ఉంటాయి.
