నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు సాయంగా వెళ్లేందుకు ప్రియాంకకు అనుమతిచ్చింది ఈడీ. కాకాపోతే.. విచారణ గదిలో కాకుండా మరో రూంలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీసు వరకు సోనియా, ప్రియాంక వెంట రాహుల్ గాంధీ వెళ్లారు. విచారణ కోసం ఆఫీస్ కు వెళ్లగానే అక్కడ్నుంచి రాహుల్ గాంధీ రిటర్న్ అయ్యారు. ఇక మూడు సెషన్లలో ఐదుగురు అధికారులు సోనియాగాంధీని ప్రశ్నించనున్నారు. ఫస్ట్ సెషన్ లో పర్సనల్ డీటైల్స్, సెకండ్ సెషన్లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి.. థర్డ్ సెషన్లో కాంగ్రెస్ పార్టీతో యంగ్ ఇండియన్ గురించి అధికారులు ప్రశ్నించనున్నారు.
మరోవైపు సోనియాగాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు బయట, లోపల కూడా నిరసలు జరిగాయి. సోనియా గాంధీకి మద్దతుగా ఈడీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అధికారులు అరెస్టు చేశారు. సోనియాగాంధీ ఈడీ విచారణ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను పెంచారు. ఔరంగాజేబ్ మార్గ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, జన్ పథ్ మార్గ్, అక్బర్ రోడ్డలను పూర్తిగా మూసివేశారు. ఈడీ ఆఫీస్, ఏఐసీసీ ఆఫీస్ దగ్గర పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించారు.
