న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఫౌండేషన్ డే ప్రోగ్రామ్ కు ఆ పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాలేదు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ పార్టీ జెండాను ఎగరేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సచిన్ పైలెట్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ ఆదివారం ఫారిన్ టూర్ వెళ్లగా, సోనియా పబ్లిక్ ఈవెంట్లకు హాజరు కావడం లేదు. రాహుల్ ఆబ్సెంట్ పై, ఆయన ఏ దేశం వెళ్లాడనే దానిపై పార్టీ స్పందించలేదు. అయితే రాహుల్ ఇటలీలోని మిలాన్ కు వెళ్లినట్లు సమాచారం.
అట్లనడం పాపం: ప్రియాంక
కేంద్రం రైతుల వాయిస్ ను వినాలని ప్రియాంక గాంధీ అన్నారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే, కేంద్రం అది రాజకీయ కుట్ర అని పేర్కొనడం తప్పన్నారు. రైతుల ఉద్యమానికి అట్లాంటి పదాలను వాడడం పాపమని పేర్కొన్నారు. కేంద్రం రైతులతో మాట్లాడాలని, అగ్రి చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
