తాగొచ్చి వేధిస్తుండని తండ్రిని చంపిన కొడుకు

శంషాబాద్, వెలుగు: తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తి తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. శంషాబాద్​పరిధిలోని ఉట్‌‌‌‌పల్లి ఇంద్రానగర్‌‌‌‌కు చెందిన ఆకుల రాములు (52), పోచమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లతో పాటు కొడుకు శివకుమార్‌‌‌‌ ఉన్నాడు. రాములు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేశాడు.

రోజూ మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులను వేధించేవాడు. మద్యానికి డబ్బులు కావాలని శుక్రవారం రాత్రి కొడుకు శివకుమార్‌‌‌‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరుగగా ఆగ్రహానికి గురైన శివకుమార్‌‌‌‌ గొడ్డలితో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాములును కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. విషయం తెలుసుకున్న శివకుమార్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.