‘‘ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 9 వేల ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్.. RPF Constable Recruitment 2022’’ అంటూ ఇటీవలే ఏదైనా వెబ్‌సైట్‌లో వార్త చూశారా? వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ వచ్చిందా? అయితే బీ అలెర్ట్!! ఈ వార్తలో నిజం లేదు. అలాంటి లింక్ వస్తే నమ్మొద్దు. జాబ్ ఆశతో వాటిని క్లిక్ చేసి మీ వివరాలను పంపి మోసపోవద్దు. ప్రస్తుతం ఎటువంటి ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ జరగడం లేదని, ఫేక్ వార్తలను నమ్మొద్దని రైల్వే శాఖ ఒక ప్రకటన చేసింది.
Some websites have published a notice claiming that the Indian Railway Protection Force (RPF) is recruiting through the RPF Constable Recruitment 2022 Exam.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 10, 2022
▶️This claim is #Fake.
▶️No such recruitment advertisement/notice has been published by the RPF. pic.twitter.com/M5ogA35fax
మరోవైపు కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పష్టత ఇస్తూ ట్వీట్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను ప్రస్తుతం రైల్వే శాఖ ప్రకటించలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. RPF Constable Recruitment 2022 అంటూ కొన్ని వెబ్‌సైట్లు ఫేక్ వార్తను పబ్లిష్ చేశాయని పేర్కొంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరిన్ని వార్తల కోసం..
మోడీ కాన్వాయ్ను అడ్డుకున్న చోటు.. పాక్ బార్డర్కు 15 కిలోమీటర్లే
టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ
ప్లేట్ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు
