కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు

  •    ఈనెల 25 నుంచి జనవరి 9 వరకు బంద్ 
  •     సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల వెల్లడి

కాజీపేట, వెలుగు: కాజీపేట– కొండపల్లి రైల్వే సెక్షన్ పరిధి మోటమర్రి రైల్వే స్టేషన్ లో మూడో రైల్వే లైను నిర్మాణ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈనెల 25 నుంచి జనవరి 9 వరకు పలు రైళ్లను నిలిపివేస్తున్నట్టు  వెల్లడించారు.  

కాజీపేట– డోర్నకల్, డోర్నకల్– కాజీపేట, డోర్నకల్– విజయవాడ, విజయవాడ– డోర్నకల్, విజయవాడ– భద్రాచలం రోడ్డు, భద్రాచలం రోడ్డు– విజయవాడ రూట్లలో ప్రయాణించే మోము రైళ్లను క్యాన్సిల్ అయ్యాయి. ఈనెల 28,29, జనవరి 2,5,7,8,9 తేదీల్లో గుంటూరు– సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్– గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కూడా నిలిపివేశారు.

ఈనెల 27, జనవరి 1,4,7,8,9 తేదీల్లో విజయవాడ – సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ ప్రెస్ ను కూడా  క్యాన్సిల్ చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రూట్లలో ప్రయాణించేవారు సహకరించాలని కోరారు.