టీచర్​ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు

  • అర్హత లేకున్న ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తున్న క్యాండిడేట్లు
  • ఆఫీసర్లకు ఫిర్యాదు

మెదక్, వెలుగు: టీచర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు. అర్హత లేకున్నా తహసీల్దార్ ​ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల నుంచి ఈడబ్ల్యూఎస్​సర్టిఫికెట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో1:3 కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేష్‌‌‌‌‌‌‌‌న కొనసాగుతోంది. మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ కింద 13 పోస్టులు ఉండగా సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కోసం 39 మందిని పిలిచారు.

వీరిలో హవేలీ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన ఇద్దరు మహిళా క్యాండిడేట్లు అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు సంపాదించి వాటిని సమర్పించారు. ఈ విషయాన్ని గమనించిన మెదక్‌‌‌‌‌‌‌‌కు చెందిన నిఖిత, రేగోడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన నరేశ్‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. అర్హత లేకున్నా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని, వారి వద్ద నిజమైన అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆఫీసర్లు స్పందించి న్యాయం చేయాలని లేదంటే లీగల్‌‌‌‌‌‌‌‌గా ప్రొసీడ్‌‌‌‌‌‌‌‌ అవుతామని స్పష్టం చేశారు. ఈ విషయమై డీఈవో వివరణ కోరగా ఈడబ్ల్యూఎస్​సర్టిఫికెట్ల విషయంలో ఇద్దరు అభ్యర్థులపై ఫిర్యాదు అందగా వారిని రిజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు తెలిపారు.