ఫార్ములా- ఈ రేస్‌‌‌‌ కేసులో పక్కా ఆధారాలు!

  • దాన కిశోర్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేసిన ఏసీబీ , రూ.600 కోట్ల అగ్రిమెంట్స్‌‌‌‌, జీవోలు, 
  • బ్యాంక్‌‌‌‌ రికార్ట్స్ లాంటి కీలక డాక్యుమెంట్లు సేకరణ
  • సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌ సహా నిందితులకు నోటీసుల జారీకి లైన్​ క్లియర్​ 

హైదరాబాద్‌‌‌‌,వెలుగు:రాజకీయ దుమారం రేపుతున్న ఫార్ములా –ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసు దర్యాప్తులో భాగంగా  మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ అండ్ అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌(ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఏసీబీ రికార్డ్​ చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్‌‌‌‌ ఆఫీసర్ మాజీద్ అలీఖాన్‌‌‌‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం దాన కిశోర్​ను విచారించింది. దర్యాప్తులో భాగంగా ప్రైవేట్​ స్థలంలో  దాన కిశోర్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్​ చేశారు. ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న అంశాలతోపాటు హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు సంబంధించిన రికార్డుల ఆధారంగా స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్నారు. 

నిరుడు ఫిబ్రవరిలో ఫార్ములా –ఈ రేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి సీజన్‌‌‌‌‌‌‌‌ –10 నిర్వహణ కోసం హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయినట్టు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,రెండో నిందితుడిగా అప్పటి ఎంఏయూడీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,మూడో నిందితుడిగా మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి లక్ష్మీనర్సింహారెడ్డిని చేర్చారు.  

కీలకంగా మారిన జీవోలు,అగ్రిమెంట్లు

ప్రధానంగా ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ నెక్ట్స్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రికార్డులు, జీవోలను ఏసీబీ అధికారులు సేకరించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖ,హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డుల వివరాలతో దాదాపు 4 గంటల పాటు స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దాన కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే రిజిస్టర్ అయిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లోని అంశాలతో ఏసీబీ అధికారులు పోల్చి చూసుకున్నారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18న ఏసీబీకి అందించిన ప్రాథమిక కంప్లయింట్​తో అదే నెల 30న జీఏడీ జారీ చేసిన జీవో ఆర్టీ నం 1449 తో పాటు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించేందుకు జీఏడీ నుంచి ఈ నెల 17న వచ్చిన పర్మిషన్ మెమో సహా నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11న ఎంఏయూడీ(విజిలెన్స్‌‌‌‌‌‌‌‌1) జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 521కు సంబంధించిన వివరాలను దానకిశోర్  వెల్లడించారు.ఈ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖ అధికారులు, ఇండియన్ ఓవర్సీస్​ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ సహా సంబంధితులను విచారించేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు.

రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ..

అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ వివరాలతో స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన పరిణామాలకు సంబంధించి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేశారు. ఫార్ములా –ఈ రేస్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ కోసం రాబోయే మూడేండ్లకుగానూ రూ.600 కోట్లు ఖర్చు చేసే విధంగా అగ్రిమెంట్స్ చేసుకున్నట్టు దాన కిశోర్​ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన అగ్రిమెంట్స్ కాపీలను ఏసీబీకి అందించారు. సీజన్‌‌‌‌‌‌‌‌ 10 నిర్వహణ కోసం  నిరుడు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25,29న హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏకు ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌లు,అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3,11వ తేదీల్లో చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ బీఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మంజూరు చేసిన రూ. 45 కోట్ల71 లక్షల 60 వేల625కు సబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ  అధికారులకు ఇచ్చారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌ కరెన్సీని పౌండ్స్‌‌‌‌‌‌‌‌గా మార్చి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11న బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేసినట్టు దాన కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారాలు అందించినట్టు తెలిసింది. 

పూర్తి డాక్యుమెంట్లతో ఏసీబీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డు నిధులు, వాటిని ఖర్చు చేసేందుకు గల నిబంధనలకు సంబంధించిన జీవో కాపీలు, రికార్డులను ఏసీబీ అధికారులు సేకరించారు. ఆర్థికశాఖ నుంచి ఎలాంటి అనుమతులు కానీ, కేబినెట్ నిర్ణయం కానీ లేకుండానే నిధుల మళ్లింపు జరిగినట్టు దాన కిశోర్ తన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఓవర్సీస్​ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో గల హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డులను కూడా ఏసీబీకి అందించారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్ అమల్లో ఉండడంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోట్‌‌‌‌‌‌‌‌ఫైల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం తమ అంతర్గత విచారణలో వెలుగు చూసిందని స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్టు సమాచారం. 

దాన కిశోర్ నుంచి సేకరించిన కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్యాక్ చేశారు. ఈ సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోర్టులో దాఖలు చేయనున్నారు. కాగా, ఫార్ములా –ఈ రేస్​ కేసు లో కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్​చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు మాత్రం ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ, ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సహా నిందితులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తున్నది.