రివాల్వర్ తో కాల్చుకుని జవాన్​ సూసైడ్  

  • రివాల్వర్ తో కాల్చుకుని జవాన్​ సూసైడ్  
  • చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​జిల్లాలో ఘటన

భద్రాచలం,వెలుగు :  సీఆర్​పీఎఫ్​జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​ జిల్లా బైరంగఢ్​ పీఎస్ పరిధిలో జరిగింది.  కెర్పు –199  సీఆర్​పీఎఫ్​బెటాలియన్​కు చెందిన హెడ్​కానిస్టేబుల్​పవన్​కుమార్​(43) శుక్రవారం తన బ్యారక్ లో సర్వీసు రివాల్వర్​తో కాల్చుకున్నాడు. పేలుడు సౌండ్​విని మిగతా జవాన్లు వెళ్లే సరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.