రామగుండం సిటీకి సోలార్​ కరెంట్‌‌‌‌‌‌‌‌.. జీరో కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్​లైట్లకు కూడా సోలారే..

  • పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా బల్దియా ఆఫీస్‌‌‌‌‌‌‌‌ 
  • జీరో కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లు దిశగా కసరత్తు 
  • ఫిబ్రవరి నాటికి స్ట్రీట్​లైట్లకు కూడా సోలారే.. 
  • ప్రతినెలా బల్దియాకు రూ.15లక్షలు ఆదా 

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌ వినియోగానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత బల్దియా ఆఫీసులో ఉత్పత్తి చేసి వినియోగించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆఫీసులకు సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌ను అందించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆ తర్వాత స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్లకు కూడా ఈ కరెంట్‌‌‌‌‌‌‌‌నే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోనే రామగుండం కార్పొరేషన్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా సెలెక్ట్ చేశారు.

బల్దియా ఆఫీస్‌‌‌‌‌‌‌‌పై ప్యానళ్ల ఏర్పాట్లు 

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో పైలట్​ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా రామగుండం బల్దియాను గుర్తించి ఆఫీస్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌పై సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం పీక్​ లోడ్​ 84 కిలోవాట్స్​గా  నమోదవుతుంది. దీంతో 97 కిలోవాట్స్​ కెపాసిటీతో ప్యానళ్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు బల్దియాలో కరెంట్ వినియోగించుకున్నందుకు ప్రతినెలా రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ బిల్లుల ఖర్చును జీరోకు తెచ్చేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఫిబ్రవరి నాటికి సోలార్​ ప్యానళ్లు బిగించి కరెంట్​ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సంబంధిత ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.

స్ట్రీట్ లైట్ల బిల్లు రూ.10 లక్షలకు పైగానే 

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ల పరిధిలో 20,327 స్ట్రీట్​ లైట్లు ఉన్నాయి. ఈ లైట్ల కోసం ప్రతి నెలా సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది. అలాగే వివిధ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్ల వాడకానికి, షాపింగ్​ ఏరియా, సులభ్​ కాంప్లెక్స్​లు, సీనియర్​ సిటిజన్​హాల్స్.. తదితరాల కోసం వినియోగించే కరెంట్​ కోసం రూ. 5 లక్షలకు పైగా బిల్లులు కడుతున్నారు. ఇప్పటికే సింగరేణి ప్రభావిత గ్రామాలు, ప్రాంతాల్లో ఆ సంస్థ సోలార్​ స్ట్రీట్​ లైట్లు ఏర్పాటు చేసింది.

రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకదాని సహకారంతో బల్దియా అంతటా సోలార్​ స్ట్రీట్​ లైట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఆఫీసర్లు ఉన్నారు. పూర్తి స్థాయిలో సోలార్​ విద్యుత్​ వినియోగం జరిగితే రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు ప్రతినెలా రూ.15 లక్షలకు పైగా 
ఆదా కానుంది.