అక్టోబర్ 2న ఆకాశంలో అద్భుతం .. రింగ్ ఆఫ్ ఫైర్.. సూర్యగ్రహణం

అక్టోబర్ 2 న ఆకాశంలో మరో అద్భుత ఖగోళఘట్టం చోటుచేసుకో బోతోంది. అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొన్నారు.

ALSO READ | ఆధ్యాత్మికం: నవగ్రహాలను పూజిస్తే .. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  అక్టోబర్​ 2 న సూర్యగ్రహణం ఏర్పడనుంది.  ఆ రోజు మహాలయ అమావాస్య అంటే.. పితృపక్షం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  సాధారణంగా అమావాస్య అంటేనే పెద్లలకు తర్పణాలు వదులుతారు.. ఆ రోజు ( అక్టోబర్​ 2 న )  వరకు 15 రోజుల పాటు భూమిపై సంచరించిన పెద్దలు భూమికి వీడ్కోలు పలికి వారి గమ్య స్థానాలకు వెళతారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. అక్టోబర్​ 2న ఏర్పడే సూర్యగ్రహణం ప్రతికూలమని పండితులు చుబుతున్నారు. ఈ కాలంలో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం

  • సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
  • ఆర్థికపరమైన విషయాలు చర్చించకూడదు
  • గ్రహణ సమయంలో ఎలాంటి పదార్దాలు తినకూడదు. 
  • మంత్రోపదేశం పొందిన వారు  అనుష్ఠానం చేసుకోవాలి
  • గ్రహణం పట్టే ముందు.. విడిచిన తరువాత స్నానం చేయాలి.
  • సూతకాలంలో నెగిటివ్​ ఎనర్జీ ఉంటుంది. 

నాసా తెలిపిన వివరాల ప్రకారం... అక్టోబర్​ 2న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.  దీంతో ఇక్కడ సూతకాలం లేదు కాబట్టి.. మన దేశంలో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరంలేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమై... నెగిటివ్​ ఎనర్జీ ఉంటుంది.  అందుకే గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు.  ఈ సమయంలో రాహువు, కేతువు .. ఈ రెండు గ్రహాల శక్తి బలంగా ఉంటుందని... అందుకే ఈ సమయంలో ఎలాంటి పదార్ధాలను.. తినకూడదని.. కనీసం మంచినీళ్లు కూడా తాగకూడదని పండితులు చెబుతుంటారు.  రాహు.. కేతు గ్రహాల దృష్టి సోకకుండి ఇళ్లపై.. నిల్వ పచ్చళ్లపై దర్భలు ఉంచుతారు. 

ఈ ప్రదేశాల్లో సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు,,

నాసా వెబ్‌సైట్ ప్రకారం...  అంటార్కిటికా.. ఉత్తర అమెరికా .. దక్షిణ అమెరికా.. అట్లాంటిక్​ మహా సముద్రం.. పసిఫిక్​ మహా సముద్రం ప్రాంతాల్లో సూర్యగ్రహణం పాక్షికంగా  కనపడుతుంది.  దక్షిణ అమెరికాలో మాత్రం కంకణాకారంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  సూర్యుడి చుట్టూ ఎర్రటి వలయాకారం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రింగ్​ ఆఫ్​ ఫైర్​ అని పిలుస్తారు.