చెట్ల పొదల్లో పైసలు.. యూట్యూబర్ అరెస్ట్

ఘట్​కేసర్, వెలుగు: సోషల్​ మీడియాలో వ్యూస్, పాపులారిటీ​ కోసం ఓఆర్ఆర్​పై నోట్ల కట్టలు విసిరిన యూట్యూబర్​ను ఘట్​కేసర్​ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని బాలానగర్​కు చెందిన రాయలపురం భానుచందర్​గా గుర్తించారు. మనీ హంట్ చాలెంజ్ ​పేరుతో నిందితుడు యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేస్తున్నట్లు ఉప్పల్ ఏసీపీ చక్రపాణి తెలిపారు. యువత ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు వీడియోలను స్ఫూర్తిగా తీసుకొని, జైలు పాలు కావొద్దని సూచించారు.

ఆ నోట్లు ఫేకా? ఒరిజినలా?

అయితే, ఓఆర్ఆర్​పై ఫేక్ నోట్లు విసిరినట్లు నిందితుడిపై పెట్రోలింగ్ వెహికల్ ఇన్​చార్జి బండారు శ్రీరాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ, ఆ నోట్లను పోలీసులు ఇంకా రికవరీ చేయలేదు. దీంతో ఆ కరెన్సీ ఫేకా?  ఒరిజినలా? అన్నది క్లారిటీ లేదు. భానుచందర్​పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.