Sobhita Wedding Photos: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత..

నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్లల పెళ్లి ఫొటోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అక్కినేని వారి వివాహం డిసెంబర్ 4న ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి చేసుకుంది.

లేటెస్ట్గా శోభిత తన ఇంస్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం' అంటూ ట్యాగ్ చేస్తూ పెళ్ళిపీఠలపై చైతన్యతో ఉన్న ప్రేమను పోస్ట్ చేసింది.

Also Read:-విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు.. పోటీగా 30 మంది బౌన్సర్లను దింపిన మంచు మనోజ్..!

కాగా వీరిపెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాని, అడివి శేష్ తదితర స్టార్ హీరోలతోపాటు కోలీవుడ్, బాలీవుడ్ నుచి కూడా సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన తర్వాత హీరో అక్కినేని నాగచైతన్య తన కుటుంభంతో కలసి శ్రీశైల మల్లికార్జున సన్నిధికి వెళ్లి దర్శించుకున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)