హిమాచల్ ప్రదేశ్ తో తీవ్రంగా మంచు కురుస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న మంచుతో అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో కప్పుకుపోయాయి. రహదారులపై అడుగు లోతులో మంచు పేరుకుపోవడంతో..ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో వాహనాలు మంచులో కూరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు. రానునన్న మంచు మరింత కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని…ఎమర్జీ ఉంటేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
