స్నాప్ నుంచి ‘స్పెక్టకిల్స్ 3’

స్నాప్ నుంచి ‘స్పెక్టకిల్స్ 3’

సోషల్ మీడియా యాప్ ‘స్నాప్ చాట్’ కు చెందిన గ్యాడ్జెట్ తయారీ సంస్థ ‘స్నాప్’. తాజాగా స్నాప్ నుంచి ‘స్పెక్టకిల్స్ 3’ పేరుతో కళ్లద్దాలు విడుదల చేసింది. దీనికి ముందు వచ్చిన స్పెక్టకిల్స్2 కంటే మరెన్నో అదనపు ఫీచర్లతో ఇవి రూపొందాయి. ‘స్పెక్టకిల్స్ 3’ పేరుతో రానున్న ఈ కళ్లద్దాలకు రెండు వైపులా రెండు హెచ్ డి కెమెరాలున్నాయి. రెండు కెమెరాలతో ఒకేసారి ఫొటోలు, 3డీ వీడియోలు రికార్డు చేయగలగడం దీని ప్రత్యేకత. ఈ వీడియోల్ని నేరుగా మొబైల్ కు పంపి స్నాప్ చాట్ యాప్ లో చూసుకోవచ్చు.

Snap announces Spectacles 3 eye glasses

గూగుల్ కార్డ్ బోర్డ్, వీఆర్ డివైజ్ లలో 3డీలోనూ ఈ వీడియోలు చూడొచ్చు. సర్కిల్ షేప్ లో ఉండే లెన్స్ తో వీటిని రూపొందించారు. 75 నిమిషాలు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ అయితే 70 వీడియోలు, 200 ఫొటోల వరకు తీసుకోవచ్చు. 4జీబీ మెమెరీ కెపాసిటీ కలిగి ఉన్న వీటితో 1200 ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు. స్పెక్టకిల్స్ 3 కార్బన్, మినరల్.. రెండు కలర్స్​లో దొరుకుతున్నాయి. స్టీల్ యూఎస్ బీ కేబుల్ మరో ప్రత్యేకత. లిమిటెడ్ ఎడిషన్ గా మాత్రమే ఇవి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటి ధర సుమారు రూ.26,000.