తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలంరేపింది. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఘటన స్థలంలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది.. పామును ప్లాస్టిక్ బకెట్ తో కప్పేశారు. ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని… అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది… బకెట్ కింద ఉన్న పామును సంచిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
