అతి..దేనికైనా నష్టం వాటిల్లవచ్చు. ఇదే ఇప్పుడు ఫోన్ వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అవకాశముందంటోంది టెలికాం నియంత్రణ సంస్థ(TRAI). భారీ మొత్తంలో మెసేజ్ లు పంపే సంస్థలు కొత్త నిబంధనలు పాటించకపోతే మార్చి 31 తర్వా త వినియోగదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని తెలుపుతూ ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు ట్రాయ్ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ సేవలకు సాంకేతిక సాయం అందించే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIP), సిడాక్, సాఫ్ట్‌వేర్ సంస్థల సంఘం నాన్‌కామ్, పరిశ్రమ-వాణిజ్య సంఘాలు సిఐఐ-పిక్కీ-అసోచాం, టెలికాం నెట్‌వర్క్ సంస్థలకు.. అమలు చేయాల్సిన నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. ఏప్రిల్ 1 నుండి SMS రూల్స్ తప్పకుండా పాటించాలని తెలిపింది.
