Smriti Mandhana: చరిత్ర సృష్టించిన మంధాన.. మిథాలీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌ను భారత మహిళా జట్టు 2-1 తేడాతో చేజిక్కించుకుంది. మంగళవారం(అక్టోబర్ 29) జరిగిన ఆఖరి వన్డేలో హర్మన్ సేన 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 232 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత మహిళలు 4 వికెట్లు కోల్పోయి మరో 34 బంతులు మిగిలివుండగానే చేధించారు.

మంధాన శతకం

గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతహమతవుతున్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(100) ఎట్టకేలకు గాడిలో పడింది. కీలక మ్యాచ్‌లో సెంచరీ బాది జట్టుకు విజయాన్ని అందించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సరిగ్గా వంద పరుగులు చేసింది. ఇది మంధాన కెరీర్‌లో ఎనిమిదో శతకం కాగా.. తద్వారా మాజీ మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ ముందు వరకూ వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు మిథాలీ పేరిట ఉండేది. ఆమె ఖాతాలో ఏడు వన్డే సెంచరీలు ఉన్నాయి. దానిని మంధాన అధిగమించింది.

ALSO READ | వైడ్ బాల్‌కు ఔటేంది.. క్రికెట్ గురించి నీకు ఏం తెలుసు..?: ధోనీని ప్రశ్నించిన సాక్షి

అగ్రస్థానంలో మెగ్ లానింగ్

ఇక ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డే సెంచరీల రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉంది. లానింగ్ ఖాతాలో 15 శతకాలు ఉన్నాయి.

  • మెగ్ లానింగ్: 15 సెంచరీలు 
  • సుజీ బేట్స్: 13 సెంచరీలు 
  •  టాంసిన్ బ్యూమాంట్: 10 సెంచరీలు 
  • నట్ స్కివర్-బ్రంట్: 9 సెంచరీలు
  • ఆటపట్టు: 9 సెంచరీలు
  • షార్లెట్ ఎడ్వర్డ్స్: 9 సెంచరీలు
  • స్మృతి మంధాన: 8 సెంచరీలు